కుక్క మిస్సింగ్.. ఆచూకీ చెప్పిన వారికీ పారితోషకం
గుంటూరు బ్రాడీపేటలో మోజెస్ కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని, మ్యాక్స్ అని పేరు పెట్టి, 2సం లుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 10న మాక్స్ ఇంటి నుండి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు దాని కోసం ఎదురు చూసిన తర్వాత, అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో, వారు వినూత్నంగా పాంప్లెట్ రూపొందించారు, ఇందులో మాక్స్ ఫోటో, వయస్సు, ఆనవాళ్లతో పాటు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం కూడా ప్రకటించారు.