తెనాలి: సహానా కుటుంబాన్ని ఓదార్చిన జగన్
తెనాలిలో రౌడీషీటర్ నవీన్ పైశాచిక దాడిలో మృతి చెందిన సహానా మృతదేహాన్ని బుధవారం గుంటూరు జీ జీ హెచ్ లోని మార్చురీలో వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పి ఓదార్చారు. నిందితుడికి శిక్ష పడేలా తమ పార్టీ పోరాడుతుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఆమెపై దాడి ఎలా జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.