పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడాలని, కళాశాల ప్రాంగణంలో కబ్జా రాయుళ్లు వేసిన అక్రమ మెటల్ రోడ్డును తొలగించేందుకు కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల భూముల పరిరక్షణ కమిటీ కమిటీ కన్వీనర్ కృష్ణా నాయక్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పిడుగురాళ్ల పట్టణం, ఎస్. టి. యు భవనం లో ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం శనివారం ఏర్పాటు చేసి మాట్లాడారు.