పిడుగురాళ్ల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని కరెంటు సరఫరా మరియు ఎల్ టీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ స్కెచెస్ తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లా ఎస్ ఈ డా. ప్రత్తిపాటి విజయకుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 33/11 కెవి ఎ కొండమోడు సబ్ స్టేషన్ను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు, పెండింగ్ బకాయిలు, సోలార్ పీఎం సూర్య ఘర్ పై సమీక్ష నిర్వహించారు.