Jan 25, 2025, 09:01 IST/
అన్నవరం వెళ్లే భక్తులకు శుభవార్త
Jan 25, 2025, 09:01 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయానికి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలోనే.. అన్నవరంలో కూడా వసతి గదుల కేటాయింపులో నిబంధనలు పాటించాలని ఈవో సుబ్బారావు ఆదేశించారు. గదుల కోసం స్వయంగా వచ్చిన భక్తులకు బయోమెట్రిక్, ఆధార్, ఫోన్ నంబరు ద్వారా కేటాయించాలని.. గది ఖాళీ చేసే సమయంలో కూడా బయోమెట్రిక్ విధానం పాటించాలన్నారు. దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వకుండా భక్తులకు గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.