వెల్దుర్తి మండలం పిచ్చయ్య బావితండాలో మాచర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీదారులపై గ్రామస్థులు సమాచారం ఇవ్వాలని సూచించారు.