మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ 14 రోజుల పసికందుకు పునర్జన్మిచ్చింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహేశ్వరరావుకు పుట్టిన శిశువుకు ప్లేట్ లెట్స్ పడిపోవటంతో ఆరోగ్యం క్షీణించి, వైద్యానికి డబ్బులు లేక మంత్రిని ప్రజా దర్బార్లో గతంలో కలిశారు. సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించి పసికందు ప్రాణాలను కాపాడారు. తమ బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో వారు బుధవారం మంగళగిరిలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.