తల్లి కోసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి: జోసఫ్

84చూసినవారు
రొంపిచర్ల స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో గురువారం జిల్లా దోమ పీడీ జోసఫ్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పల్నాడు జిల్లాలో తల్లి కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక మొక్క నాటాలని కోరారు. కార్యక్రమంలో ఏపీడీ సుధాకర్, తాహశీల్దార్ నిర్మల, మాజీ ఎంపీపీ రామారావు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.