భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డాన్స్ చేశారు. ప్రకాశ్ నగర్ లోని వారి ఇంటి వద్ద భోగి పర్వదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంక్రాంతి పాటలతో సందడి చేశారు. సంక్రాంతి పర్వదినం మొదటి రోజైన భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.