ఎంఐఎం, ముస్లిం పరిరక్షణ కమిటీ నకరికల్లు వారి ఆధ్వర్యంలో టర్కీ లోని ఇస్తాంబుల్ నగరంలో పవర్ మెడల్స్ సాధించిన మంగళగిరికి చెందిన సోనియాను వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముస్లిం పరిరక్షణ సమితి సభ్యులు ఎండి. లతీఫ్ మాట్లాడుతూ సానియాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించి ప్రోత్సహించాలన్నారు. ఎంఐఎం సభ్యులు నాగూర్, హైదర్, దిశ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.