నరసరావుపేట: గుండాల రాకేష్ కి జాతీయ విశిష్ట సాహితీ పురస్కారం
నరసరావుపేటకు చెందిన ప్రముఖ కవి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కార్యదర్శి గుండాల రాకేష్ కు "తెలుగు తేజం జాతీయ విశిష్ట సాహితీ పురస్కారం" అందింది. తెలుగు అసోసియేషన్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాకేష్ యొక్క సాహిత్య, సాంస్కృతిక సేవలను గుర్తించి జనవరి 21న విజయవాడలో పురస్కారం ప్రదానం చేయనున్నారు.