రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామ పరిధిలోని మిద్దె వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అతి వేగంగా వెళుతున్న రెండు బైకులు ఒకదానికొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నకరికల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.