వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదనలో గల విగ్నేశ్వర సమేత మహాశివునికి సోమవారం రాత్రి అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు ప్రతి సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారికి ఇష్టమైన సోమవారం అభిషేకాలు పూజలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు.