పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుక్రవారం అమరావతిలో రోడ్ల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని ఛాంబర్ నందు కలిశారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంత్రిని కోరారు. గత ఐదేళ్లు రోడ్లు మరమ్మత్తులు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.