మద్యం దుకాణాల టెండర్ల విషయంలో బయట చెప్పే ఎటువంటి దుష్ప్రచారాలు ప్రజలు, టెండర్ దారులు నమ్మవద్దని గురువారం జిల్లా ట్రాన్స్పోర్టు డివిజనల్ సీఐ శ్రీనివాసమూర్తి తెలిపారు. పెదకూరపాడు మండలంలో 10 షాపులు ఉంటే ఒకే షాప్ కింద 10 టెండర్లు వేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎన్ని షాపులకైనా టెండర్లు వేసుకునే అవకాశం ఈనెల 11 వరకే ఉందన్నారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.