ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాకు నివాళి
పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ స్తూపం సెంటర్లో శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు వివిధ ప్రజా సంఘాలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించి జీవిత ఖైదీలుగా జైల్లో మగ్గించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనన్నారు.