Mar 15, 2025, 08:03 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: అన్ని ఏర్పాట్లు పూర్తి: ఈవో వినోద్
Mar 15, 2025, 08:03 IST
రేపటి నుంచి అనగా ఆదివారం ఐదు రోజులపాటు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శివ కళ్యాణం కన్నుల పండువగా జరగనుందని శనివారం ఒక ప్రకటనలో ఈవో వినోద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించి సేవలో తరించాలని కోరారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.