కోనంకి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..
పిడుగురాళ్ల మండలంలోని కోనంకి, పాతగణేశునిపాడు గ్రామాలలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమం జరిగింది. సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట నమోదు లాభాలు, పంటల బీమా గురించి వివరించారు. హైబ్రిడ్ వెజిటేబుల్స్, హార్టికల్చర్ పథకాలు, బిందు మరియు తుంపర సేద్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు సబ్సిడీ అందించనున్నట్లు చెప్పారు.