గ్రామ అభివృద్ధి ప్రణాళికలను ప్రతి గ్రామ పంచాయతీ సిద్ధం చేయాలి

272చూసినవారు
గ్రామ అభివృద్ధి ప్రణాళికలను ప్రతి గ్రామ పంచాయతీ సిద్ధం చేయాలి
గ్రామ అభివృద్ధి ప్రణాళికను ప్రతి పంచాయతీ సిద్ధం చేయాలని ఎంపీపీ భవనం పద్మలీల పేర్కొన్నారు. పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీటీసీ సభ్యులకు గ్రామ అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా నిలుపుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. దీనికనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీలోని అన్ని శాఖల అధికారులు గ్రామంలో ఏఏ పనులకు ఎంతెంత నిధులు కేటాయించాలో ఏ ఏ పనులు ఏ సమయంలో చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి శివ సుబ్రహ్మణ్యం, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్