గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామం ప్రధాన రహదారిపై సోమవారం ట్రాక్టర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురరుగా వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పేర్కొన్నారు. క్షతగాత్రున్ని పెదనందిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.