కాకుమాను మండలంలో రైతులు ముమ్మరంగా మిర్చి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు వ్యవసాయ అధికారులు ఆదివారం పలు సూచనలు చేశారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడకూడదని, తద్వారా పంటకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని తెలిపారు. నిత్యం పంటను పరిశీలిస్తూ పురుగు ఆశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వ్యవసాయ అధికారులు సూచించిన మందులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.