అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉష చిలుకూరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఆమె నానమ్మ, ప్రొఫెసర్ శాంతమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుతమైన స్థానాన్ని అందుకోబోతున్న మీ ఇద్దరికి శుభాకాంక్షలు. మీకు, మీ దేశానికి, నా దేశానికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.