నిజాంపట్నం మండలం గూడపాటి వారి పాలెం శివారులో శనివారం రాత్రి నగరం మండలం దాసరిపాలెం కు చెందిన నున్న భూషయ్య (45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. భూషయ్యను స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. భూషయ్య హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరం ఎస్సై భార్గవ్ ఆదివారం మీడియాకు తెలిపారు.