2023లోనే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు

59చూసినవారు
2023లోనే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు
ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచాయి. డిమాండ్‌ ఉన్న నగరాల్లో రూ.6 వసూలు చేయనున్నాయి. ఇప్పటివరకూ ఈ ఫీజు రూ.5గా ఉంది. దీంతో 20 శాతం పెంచినట్లయింది. బెంగళూరులో ప్లాట్‌ఫామ్‌ ఫీజును స్విగ్గీ రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6కు తగ్గించింది. జొమాటో, స్విగ్గీ ఇలా ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచడం ఇది తొలిసారేమీ కాదు. ఈ రెండు కంపెనీలు ఈ తరహా ఫీజును 2023లో ప్రవేశపెట్టాయి. రూ.2తో దీన్ని ప్రారంభించాయి. క్రమంగా పెంచుతూ వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్