స్విగ్గీ, జొమాటోలు హోటల్ యాజమాన్యాలను సంప్రదించకుండానే ఆఫర్లు పెడుతున్నాయి. దీంతో ఆ భారం హోటల్ నిర్వాహకులపై పడుతోంది. రీఫండ్ పాలసీ కూడా సక్రమంగా లేదు. దీని వల్ల చిన్నచిన్న రెస్టారెంట్లకు నష్టం వాటిల్లుతోంది. స్విగ్గీలో రెస్టారెంట్ కనిపించాలంటే నగదు చెల్లించాలని చెప్పి అందరి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. కస్టమర్ కట్టే జీఎస్టీలోనూ కమీషన్ వసూలు చేస్తోంది. నిర్వాహకులకు నగదు చెల్లించకుండా నెలలతరబడి కాలయాపన చేస్తోంది.