రేపల్లెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

68చూసినవారు
రేపల్లెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రేపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రక్కబజారులో గుర్తు తెలియని వ్యక్తి (65) మృతదేహం లభ్యమైంది. ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. సోమవారం గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సమాచారం వచ్చిందన్నారు. అక్కడికి చేరుకొని పరిశీలించగా ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్