రేపల్లెలో రమేష్ హాస్పటల్ పక్కన గ్యాస్ కంపెనీ బజార్ లో టిఫిన్ వ్యాపారం చేసే చుండూరు వెంకటేశ్వర్లుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. వ్యాపారం అనంతరం ఇంటికి వెళుతుండగా రామకోటిపేట రెండో లైన్ వద్ద నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లుపై దాడి చేశారు. దాడిలో గాయాల పాలైన వెంకటేశ్వర్లు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.