జడ్పీ ఆస్తులను అన్యక్రాంతం కాకుండా పరిరక్షిస్తాం
జిల్లా పరిషత్ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెని క్రిస్టినా వెల్లడించారు. సత్తెనపల్లిలో బుధవారం కట్టమూరి నరసింహారావు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ప్రాంగణానికి శిలాఫలకాన్ని స్థానిక శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆవిష్కరించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో 2500 ఎకరాల భూములు ఉన్నాయని అవి అన్యక్రాంతం కాకుండా చూస్తానన్నారు.