TG: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు భవిష్యత్తులో ఒకే పార్టీలో ఉండరని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.