మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కౌన్సిలర్లు
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను బుధవారం సత్యసాయి జిల్లా హిందూపురంకు చెందిన నలుగురు కౌన్సిలర్లు కలిసి వైసీపీలో చేరారు. వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లను భయపెట్టి, మభ్య పెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్థానం దక్కించుకునేందుకు భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారన్నారు.