పట్టపగలే రైల్వే మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొంది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలులో సదరు మహిళ గార్డుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో సిగ్నల్ కోసం గూడ్స్ ట్రైన్ ఆగింది.
రైలు వెనుక భాగంలో ఉన్న గార్డ్ పెట్టెలోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న మహిళా గార్డ్ ను బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించారు. రైలు కదలగానే దుండగులు పరారైనట్లు తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ లో ఆర్పీఎఫ్ పోలీసులకు మహిళ గార్డు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.