తాడేపల్లి పరిధి జాతీయ రహదారి వెంట ఉన్న లాడ్జీలు, హోటల్స్ లో ఆదివారం తాడేపల్లి ఎస్ ఐ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీఐపీ జోన్ కావడంతో రికార్డులను పరిశీలించి, నిబంధనలకు లోబడి రూములు అద్దెకు ఇవ్వాలని యాజమాన్యాలకు పోలీసులు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.