ప్రకాశం బ్యారేజీ పైకి ఎవరు రావద్దు: సీఐ
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రజలెవరూ రావద్దని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఆదివారం సూచించారు. బ్యారేజీ వద్దనుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని కావున ప్రకాశం బ్యారేజీపైకి వాహనాలను అనుమతించడం లేదని చెప్పారు. వాహనదారులు ఎన్టీఆర్ కట్ట మీదగానే ప్రయాణం సాగించాలని సూచించారు. సరదాగా సెల్ఫీలు దిగేందుకు ఇక్కడికి రావద్దని వరదనీరు తగ్గినతరువాత మాత్రమే రావాలన్నారు.