ఏడున్నర నెలల పెండింగ్ జీతాలు, పని భద్రత, రక్షణ పరికరాలు, సమాన పనికి సమాన వేతనం కొరుతూ రాజధాని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరసన శుక్రవారం తో నాలుగవ రోజుకు చేరినట్లు రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మంగళగిరి మండలం లోని ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేస్తున్న పారిశుధ్య కార్మికులకు రవి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పారిశుధ్య కార్మికులుకు చెల్లించాల్సిన జీతాలను, చెల్లించి వారికి పనిభద్రత, రక్షణ పరికరాలను అందజేయాలని డిమాండ్ చేశారు.