గుంటూరు నెహ్రూ నగరలోని అయ్యప్ప దేవస్థానంలో మంగళవారం స్వామివారి కర్పూర జ్యోతి దర్శన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కర్పూర జ్యోతిని గురుస్వాములు వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది.