మంత్రి నారా లోకేశ్ గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏకగ్రీవ ఎంపిక పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ సభలో ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రగతిపై ఆరోగ్య వంతమైన చర్చ జరిగేందుకు తన వంతు సహకారం అందించాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు.