తుళ్లూరు: మహిళలు సామాజిక మాధ్యమాల్లో సమాచారం పెట్టరాదు

82చూసినవారు
ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లి ప్రజల్లో భద్రత, విశ్వాసాన్ని నింపే ప్రయత్నంలో భాగమే వారధి కార్యక్రమం అని తుళ్ళూరు సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్యలు అన్నారు. శుక్రవారం తుళ్లూరు మండలం వడ్డమానులో వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలని చెప్పారు. మహిళలు సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత సమాచరాన్ని పెట్టరాదని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్