
తెనాలి: ప్రజలకు సక్రమంగా రక్షిత మంచినీరు సరఫరా చేయాలి: నాదెండ్ల
తెనాలి వి. యస్. ఆర్ అండ్ ఎన్. వి. ఆర్ కాలేజీ వద్ద ఉన్న రక్షిత మంచినీటి సరఫరా పథకం ప్రాంగణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రక్షిత కేంద్రం ద్వారా ఇంటింటికీ జరుగుతున్న నీటి సరఫరా వివరాలను మంత్రి మనోహర్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఐఏఎస్ అధికారి స్వప్నల్ పవర్ సంబంధిత వివరాలను మంత్రి మనోహర్‌కు వివరించారు.