బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు జులుం విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు జబర్దస్త్ వర్ష, హర్షసాయిలపై జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినీ నటుడు అలీ సతీమణి జూబెద, యాంకర్ లాస్య కూడా ఇందులో ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. వీరి యూట్యూబ్ ఛానల్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంపత్ డిమాండ్ చేశారు.