తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు

75చూసినవారు
తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం సందర్భంగా ప్రతి శని, ఆదివారాలలో తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పుణ్య క్షేత్రాలను ఒక్క రోజులోనే దర్శించుకుని తెనాలి చేరుకోవచ్చని అన్నారు. సూపర్ లగ్జరీకి రూ. 1270, లగ్జరీ బస్సుకు రూ. 1200 ఛార్జీలుగా నిర్ణయించామన్నారు. శ్రీశైలానికి కూడా బస్సులు నడుపుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్