వినుకొండలో అడిషనల్ ఎస్పీ అధ్వర్యంలో భారీ బందోబస్తు

63చూసినవారు
వినుకొండ పట్టణంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ అధ్వర్యంలో మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలోని విఠంరాజుపల్లి బాలాజీ ఎస్టేట్ వద్ద రోడ్డుపై బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పట్టణంలోకి ఎటువంటి వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో సీఐ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్