వినుకొండ నియోజకవర్గ పరిధిలోని 47 మందికి మంజూరైన రూ. 92 లక్షల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 2014- 19 మధ్య కాలంలో వినుకొండ నియోజకవర్గంలో 2, 842 మందికి రూ. 11. 78 కోట్ల సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.