తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏపీలో గురువారం 59 మండలాల్లో వడ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడ గాలులు వీస్తాయని అంచనా వేసింది. కాగా, నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. వడగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.