మధ్యప్రదేశ్‌లో పడవ మునక.. ఏడుగురి మృతి

55చూసినవారు
మధ్యప్రదేశ్‌లో పడవ మునక.. ఏడుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శివపురి జిల్లాలోని మటాతిల డ్యామ్‌లో మంగళవారం సాయంత్రం 15 మందితో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. మిగతావారిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్