అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు ఉన్న సునీత, విల్మోర్ అక్కడ నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు. 150కి పైగా ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. ఇందులో అంతరిక్ష వ్యవసాయం, భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితరాలు ఉన్నాయి. అంతరిక్ష తోటపని ప్రయోగాల్లోనూ సునీత పాలుపంచుకున్నారు. ఐఎస్ఎస్‌లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు.