పేదల ఇళ్లపై హక్కులు వారికే: అనగాని

66చూసినవారు
పేదల ఇళ్లపై హక్కులు వారికే: అనగాని
AP: పేద ప్రజలు నివసించే ఇళ్లపై వారికే హక్కులు కల్పించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. భూ సంస్కరణలపై ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. 22 ఏ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూముల వివాదాలపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కబ్జా భూములను ప్రభుత్వపరం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్