సునీతకు డాల్ఫిన్స్ హార్ట్లీ వెల్​కమ్ (వీడియో)

79చూసినవారు
తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్స్ చేరాయి. సరిగ్గా వ్యోమగాములు ల్యాండ్ అవుతున్న సమయంలో వెల్​కమ్ చెబుతున్నట్లుగా డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సంబంధిత పోస్ట్