హైదరాబాద్‌కు అతిసమీపంలోని వికారాబాద్ జిల్లాలో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ దామగుండం అడవి కొన్ని లక్షల చెట్లకు నెలవు. జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అనేకరకాల పక్షులకు నివాస ప్రాంతమైన ఈ అడవి జీవవైవిధ్యంతో అలరారుతున్నది. అంతేకాకుండా ఈ అడవి ఎన్నోరకాల అరుదైన, ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. మొత్తం 2,900 ఎకరాల అటవీ భూమిలో యాంటెన్నా పార్క్ 1400 ఎకరాలు, టెక్నికల్ ఏరియా 1090 ఎకరాలు, కార్యాలయం 310 ఎకరాలు, రేడియేషన్ సేఫ్ జోన్ 100 ఎకరాలుగా ఉంటుంది.