ఏపీలో రేపు భారీ వర్షాలు

28990చూసినవారు
ఏపీలో రేపు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ట్యాగ్స్ :