ఆలయాలకు ఆవు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ

76చూసినవారు
ఆలయాలకు ఆవు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు ఆవు నెయ్యి సరఫరాపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాలకు ఆవు నెయ్యి సరఫరాపై డెయిరీ ప్రతినిధులతో మంత్రి ఆనం భేటీ అయ్యారు. 15 రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏటా ఆలయాలకు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమవుతుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో ఆవు నెయ్యి సేకరించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్